Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల భద్రత కు ప్రభుత్వం హామీ ఇవ్వాలి

Follow Udayam on Google
K Anuradha Aug 22, 2026 12:23 PM శ్రీకాకుళంGeneral
జర్నలిస్టుల భద్రత కు ప్రభుత్వం హామీ ఇవ్వాలి - Udayam
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో భూ కబ్జాలపై విశాలాంధ్రలో కథనాలు రాసిన విలేకరి గోవిందరావుపై దుండగులు కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనను జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా APUWJ పలాస శాఖ ఆధ్వర్యంలో కాశీబుగ్గ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు శనివారం ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...