వార్తలకు తిరిగి వెళ్లండి

నమస్తే తెలంగాణ జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్‌లపై జరిగిన దాడికి నిరసనగా నారాయణపేట జిల్లా కృష్ణా మండలం టై రోడ్డు వద్ద జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. అంతరాష్ట్ర రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
కృష్ణా నదిలో అక్రమ ఇసుక దందాను కవర్ చేయడానికి వెళ్లిన విలేకరి రాము, ఫోటోగ్రాఫర్‌పై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడటాన్ని ఖండిస్తూ అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సుమారు గంటపాటు ఈ ఆందోళన చేపట్టారు.
Comments
Loading comments...

