వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవాలు
Suresh Jun 22, 2026 1:50 PM విశాఖపట్నం 5 viewsabout 1 hour ago

విశాఖ అంబికాబాగ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి 13వ వార్షిక కల్యాణోత్సవాలు జూన్ 23 నుండి 29 వరకు ఘనంగా జరగనున్నాయి. మంగళవారం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమై, 25న కల్యాణం, 29న పుష్పయాగంతో ముగియనున్నాయి.
ఈ ఏడు రోజుల ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం, చక్రస్నానం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవస్థాన అధికారులు కోరారు.
Comments
Loading comments...