వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 12న జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ అధికారి వరలక్ష్మి తెలిపారు. క్యాడ్‌బరీ కంపెనీలో టీమ్ మెంబర్ ట్రైనీ పోస్టులకు ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన 18–21 ఏళ్ల యువతీ యువకులు అర్హులన్నారు.
ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల వేతనంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయాలు ఉంటాయని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

