వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలు రాఖీ పౌర్ణమి ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్షాబంధన్ పురస్కరించుకొని శుక్రువారం జన్నారం పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఉన్న తమ సోదరులకు మహిళలు రాఖీలు కట్టి ఆశీర్వాదం పొందారు.
చిన్నారులు తమ అన్నలకు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి సంబర పడుతున్నారు. రాఖీ పౌర్ణమితో జన్నారం మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డ వారు సొంత గ్రామాలకు వస్తున్నారు.
Comments
Loading comments...

