వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం పట్టణంలోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశామని ఈవో రాహుల్ వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని అంగడి బజార్, వినాయక్ నగర్, రామాలయం ప్రాంతాలలో పంచాయితీ కార్మికులు చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు.
రెండు రోజులపాటు వర్షాలు పడడంతో రోడ్లపై వరద నీరు ప్రవహించిందని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు కూడా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

