వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పలు గ్రామాలలో మోస్తారు నుంచి భారీ వర్షం నమోదు అవుతోంది. ఆదివారం ఉ.8 గంటల ప్రాంతంలో జన్నారం పట్టణంతో పాటు ధర్మారం, కిష్టాపూర్, దేవునిగూడెం, హాస్టల్ తండా, బంగారు తండా, టిజీపల్లి, మందపల్లి, ఇందన్ పల్లి గ్రామాలలో మోస్తారు నుంచి భారీ వర్షం ప్రారంభమైంది.
ఎల్నినో ప్రభావంతో నాలుగు రోజులుగా వర్షపాతం నమోదు కాలేదు. దీంతో పొడి వాతావరణంలో ఉక్కపోతతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...

