Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారంలో ఆదివాసి సంఘం నాయకుల ఆందోళన

Follow Udayam on Google
p.g.murthy Aug 03, 2026 1:28 PM మంచిర్యాలGeneral
జన్నారంలో ఆదివాసి సంఘం నాయకుల ఆందోళన - Udayam
ఆదివాసి యువకులపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నాయకులు రాయి సీడం ఖాలి డిమాండ్ చేశారు. అటవీ అధికారుల దాడికి నిరసనగా సోమవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై ఆదివాసులతో కలిసి ఘటన చేశారు. అటవీ అధికారులు ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...