వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెంలో బుధవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడో వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే. వెంకటరమణ పాల్గొని సిబ్బంది, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.
తడి, పొడి చెత్తను వేర్వేరుగా పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ కోరారు.
Comments
Loading comments...

