Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ: 14 పోస్టులకు రాత పరీక్ష పూర్తి

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 5:28 PM జనగామ General
జనగామ: 14 పోస్టులకు రాత పరీక్ష పూర్తి - Udayam
జనగామ కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, మిషన్ శక్తి మహిళా సాధికారత విభాగాల్లో 14 పోస్టుల భర్తీకి గురువారం రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 112 మంది దరఖాస్తు చేసుకోగా, 98 మంది హాజరై 14 మంది గైర్హాజరయ్యారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...