వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మండలం జంగాలపల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా కర్నే రతన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు.
ప్రధాన కార్యదర్శిగా సంగని మహేష్, ఉపాధ్యక్షులుగా శ్రీపాద శ్రీను, బొమ్మగాని రాకేష్ ఎన్నికయ్యారు. గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.
Comments
Loading comments...

