Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మికుంటలో మార్కెట్‌ కమిటీ సమావేశం

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 9:59 AM కరీంనగర్General
జమ్మికుంటలో మార్కెట్‌ కమిటీ సమావేశం - Udayam
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం ఛైర్‌పర్సన్‌ పుల్లూరి స్వప్న అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. పత్తి, మక్కల కొనుగోళ్లు, రైతులకు కనీస మద్దతు ధర కల్పనపై చర్చించి తీర్మానాలు చేశారు. కొత్త, పాత మార్కెట్లలో తారురోడ్లు, ప్రహరీలు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. మార్కెట్‌ ఆదాయ, వ్యయాలను సమీక్షించారు.

Comments

G
Loading comments...