Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలసమాధి అయిన చిన్నారుల వివరాలివే

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 10:58 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
జలసమాధి అయిన చిన్నారుల వివరాలివే - Udayam
ఈతకెళ్లిన ముగ్గురు చిన్నారుల శ్వాస కోనేటిలో కలిసిపోయి కన్నవారికి కన్నీటి ధారను మిగిల్చిన ఘటన విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుధరాయవలసలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (9), వెంకటేశ్(9), వేమచంద్ర(9)లు సాయంత్రం వరకు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. కానీ చెరువు వారి జీవితాలను చిదిమేడంతో కన్నవారి ఆక్రందనలు మిన్నింటాయి. సీఐ శంకర్రావు, ఎస్సై లోకేశ్ కుమార్ కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...