Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో జీ.ఎం.ఎస్.కె లకు ఎస్పీ దిశానిర్దేశం

Follow Udayam on Google
s. j. dineshkumar Jul 28, 2026 7:56 PM చిత్తూరుక్రైమ్
జిల్లాలో  జీ.ఎం.ఎస్.కె లకు ఎస్పీ దిశానిర్దేశం - Udayam
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 51 మంది గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు శాఖకు అనుసంధానం అయ్యారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహిళలు, చిన్నారుల భద్రత, శక్తి టీమ్స్‌తో సమన్వయం, సైబర్ నేరాల అవగాహన, బాల్య వివాహాల నిరోధం, మానవ అక్రమ రవాణా నివారణ వంటి అంశాలపై గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...