Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో హఠాత్తుగా మారిన వాతావరణం

Follow Udayam on Google
RAGHU Aug 03, 2026 1:17 PM శ్రీకాకుళంGeneral
జిల్లాలో హఠాత్తుగా మారిన వాతావరణం - Udayam
జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం సింగుపురం, భైరి, అలికాం, గార తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం నుంచి భానుడి తీవ్ర ప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా, మధ్యాహ్నం నల్లమేఘాలు కమ్ముకుని పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. ఈదురు గాలులు బలంగా వీయడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం పొందారు.

Comments

G
Loading comments...