వార్తలకు తిరిగి వెళ్లండి
విజయనగరం జిల్లా వైసీపీ నూతన అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ను ఆదివారం రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ రాజు, రాజాం సమన్వయకర్త తలే రాజేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.
నూతన బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్కు అభినందనలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చంద్రశేఖర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పలువురు వైసీపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

