వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధి మండలం పెదవలసలో డోలీ మోతల నివారణ లక్ష్యంగా రూ.1.80 కోట్లతో చేపట్టనున్న పెదలంక రహదారి నిర్మాణ పనులను మాజీ సర్పంచ్ కృష్ణవంశీ శనివారం ప్రారంభించారు. గ్రామాల్లో సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ చొరవతో ఈ రహదారి పనులు జరుగుతున్నాయని కృష్ణవంశీ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

