Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గాసాగర్‌లో రూ.4 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 10, 2026 4:07 PM జగిత్యాలGeneral
జగ్గాసాగర్‌లో రూ.4 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం - Udayam
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల నుంచి రూ.4 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ పుల్ల సాయగౌడ్ గురువారం ప్రారంభించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రోడ్డు నిర్మాణంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీఎస్ మమత, ఉపసర్పంచ్ లక్ష్మణ్ చిన్నయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...