వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలకు పునఃటెండర్ నిర్వహించి అర్హులకు కేటాయించాలని పట్టణానికి చెందిన జయపాల్ డిమాండ్ చేశారు. కొందరు 20 ఏళ్లుగా దుకాణాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం ఎంఆర్ఓ, ఎంపీడీఓలకు వినతిపత్రం అందజేశారు.
అధికారులు పునఃటెండర్ నిర్వహించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని జయపాల్ హెచ్చరించారు.
Comments
Loading comments...

