Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఆసుపత్రి వద్ద తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లతో ముప్పు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:38 PM మహబూబ్‌నగర్General
జడ్చర్ల ఆసుపత్రి వద్ద తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లతో ముప్పు - Udayam
జడ్చర్ల పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో డ్రైనేజీ మ్యాన్‌హోళ్లకు మూతలు లేక ప్రమాదకరంగా మారాయి. గుంతల్లో చెట్టు కొమ్మలు ఉంచినా ప్రమాదం తప్పడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ వెలుతురు లేక బాటసారులు, పశువులకు ముప్పు పొంచి ఉందని, దుర్వాసనతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత మూతలు ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...