Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల 10వ వార్డులో స్వచ్ఛభారత్ కార్యక్రమం

Follow Udayam on Google
Sreekanth Patel Oct 02, 2026 4:59 PM మహబూబ్‌నగర్General
జడ్చర్ల 10వ వార్డులో స్వచ్ఛభారత్ కార్యక్రమం - Udayam
సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ 10వ వార్డులోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు దేవాలయ పరిసరాలను శుభ్రం చేశారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో అమర్నాథ్ గౌడ్, శ్యామల నాగరాజు, ఎంబీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...