వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు హీరోపై అభిమానం జపనీస్ ప్రేక్షకులను సరిహద్దులు దాటించింది. తమ ప్రియతమ నటుడి సినిమాను మొదటి రోజు, మొదటి షో చూడాలనే తపనతో మసామీ, క్రిస్ అనే ఇద్దరు జపాన్ అభిమానులు ఐదు రోజులు ఆఫీసులకు సెలవు పెట్టి మరీ హైదరాబాద్ నగరంలో వాలిపోయారు.
థియేటర్ల వద్ద కనిపించే పండుగ వాతావరణం, అభిమానుల కోలాహలాన్ని చూడాలనే ఆరాటంతో వారు ఇక్కడికి వచ్చారు. వీరితో పాటు స్నేహితురాలు కణ్మని కూడా ఉన్నారు. టోక్యో నుండి టాలీవుడ్ వరకు సాగిన వీరి అరుదైన సినీ ప్రయాణం ప్రస్తుతం ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

