వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో జనసేన పార్టీ బలోపేతానికి చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించిందని టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. గత ఐదు రోజుల్లో జిల్లావ్యాప్తంగా దాదాపు 720 దరఖాస్తులు అందాయని, మరో రెండు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.
పదవులు ఆశించే వారి నుంచి వచ్చిన ఈ దరఖాస్తులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలిస్తారని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...

