Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మిచేడు జమ్ములమ్మకు అమావాస్య పూజలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 12, 2026 11:13 AM జోగులాంబ గద్వాల్ General
జమ్మిచేడు జమ్ములమ్మకు అమావాస్య పూజలు - Udayam
జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని బుధవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణానది జలాలతో అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసి అర్చన, ఆకు పూజ, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నేడు అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...