Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ యత్నం

Follow Udayam on Google
vihar Aug 31, 2026 4:58 PM పల్నాడు General
ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ యత్నం - Udayam
వినుకొండ మండలం వెంకుపాలెం సమీపంలోని జగనన్న కాలనీలో ఆదివారం రాత్రి ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ యత్నం కలకలం రేపింది. కాలనీలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను కొందరు దుండగులు దొంగిలించేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం స్థానికులు ఘటనపై విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...