వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పర్యటనకు సంబంధించి నంద్యాల ఎస్పీ సునీల్ షోరాణ్ షరతులు వెల్లడించారు. జైలులో ఉన్న వ్యక్తిని జైలు నిబంధనల ప్రకారం ములాఖాత్ ద్వారా పరామర్శించి తిరిగి వెళ్లేందుకు మాత్రమే పోలీసుల అనుమతి ఉంటుందని తెలిపారు.
సభలు, ర్యాలీలు, రోడ్‌షోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసుల షరతులను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

