Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు జగన్‌ రైతులతో భేటీ

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 03, 2026 9:57 PM విజయనగరంGeneral
రేపు జగన్‌ రైతులతో భేటీ - Udayam
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్ల తీరును పరిశీలించనున్నారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, సమస్యలపై చర్చించనున్నారు. ఉదయం 10.30 గంటలకు దేవరపల్లి చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...