వార్తలకు తిరిగి వెళ్లండి
ముద్రగడ మృతిపై జగన్ తీవ్ర సంతాపం

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర వార్త తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని జగన్ ఆకాంక్షించారు. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ తన గాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Loading comments...