వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న తితిదే మాజీ ఉద్యోగి టి.అరుణ్‌కుమార్‌ను తిరుమల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దర్శనం, టికెట్లు ఇప్పిస్తానని బెంగళూరు కుటుంబాల నుండి ఇతడు రూ.3.20 లక్షలు వసూలు చేశాడు.
గతంలోనూ మోసాలకు పాల్పడిన ఇతడి బ్యాంకు ఖాతాల్లో ఏడాదిలోనే రూ.85 లక్షల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుండి మొబైల్, నగదు, పాస్‌బుక్కులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

