Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎస్‌రావు మృతికి జగన్ సంతాపం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 11, 2026 8:40 PM తూర్పుగోదావరి General
జీఎస్‌రావు మృతికి జగన్ సంతాపం - Udayam
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీఎస్‌ రావు మరణం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసిన జీఎస్‌రావు కుమారుడు శ్రీనివాస్‌ నాయుడితో జగన్ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ప్రజా జీవితంలో, రాజకీయ రంగంలో జీఎస్‌ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జగన్ కొనియాడారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Comments

G
Loading comments...