Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలే సంపద: చంద్రబాబు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 11, 2026 8:07 PM విజయవాడGeneral
పిల్లలే సంపద: చంద్రబాబు - Udayam
ప్రస్తుతం జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణ నినాదం రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, పిల్లలే మన రాష్ట్ర సంపద అని, వారితోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లల సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జనాభా తగ్గాలని కోరుకున్నామని, అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పిల్లలు వద్దనుకునే ధోరణి మారాలని చంద్రబాబు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...