Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల గాలింపుపై విమర్శ

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 11, 2026 8:04 PM విశాఖపట్నంGeneral
మత్స్యకారుల గాలింపుపై విమర్శ - Udayam
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌ను ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేయడం దుర్మార్గమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గల్లంతైన వారి కోసం బాధిత కుటుంబాలు ఇంకా ఎదురుచూస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పామన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను పునరుద్ధరించాలని కన్నబాబు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...