వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండవల్లిలో రాజధాని రైతులపై జరిగిన రాక్షసకాండను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. భూములు ఇవ్వబోమని రైతులు చెబుతున్నా, వారి అభ్యంతరాలను వినకుండా పోలీసులు బుల్డోజర్లతో పంటలను ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
రైతుల గొంతు నొక్కుతూ సాగుతున్న ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఆయన ప్రశ్నించారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...

