Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా సంక్షోభంపై జగన్ భరోసా

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 15, 2026 9:03 AM పశ్చిమగోదావరి General
ఆక్వా సంక్షోభంపై జగన్ భరోసా - Udayam
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, సిండికేట్ దోపిడీ కారణంగా రాష్ట్రంలో రొయ్యల సాగు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆక్వా రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నష్టాల నేపథ్యంలో పంట విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించేందుకు కూడా రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్లిష్ట తరుణంలో తమ సమస్యలను వినేందుకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆక్వా రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. తమ పక్షాన నిలిచి పోరాడేందుకు ఆయన వస్తున్నారంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...