వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపురకు చెందిన యువకుడు జావిద్ ఉపాధి నిమిత్తం యూరప్‌లోని మాల్టా దేశానికి వెళ్లి అక్కడ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జావిద్ పార్థివదేహాన్ని శనివారం జగిత్యాలలోని ఇస్లాంపురాలో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

