Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కొలనూరి రాజేశ్

Follow Udayam on Google
B RAJESH Aug 22, 2026 12:38 PM విజయనగరంGeneral
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కొలనూరి రాజేశ్ - Udayam
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుముల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కొలనూరి రాజేశ్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యాభ్యాసంలో విశేష సేవలు అందించినందుకు కేంద్ర విద్యాశాఖ ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా ఆయన ఢిల్లీలో పురస్కారం అందుకోనున్నారు. ఈ ఎంపికపై జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు అభినందించారు.

Comments

G
Loading comments...