వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి క్రీడాకారిణి ఎం.హర్షిత జాతీయ జూనియర్ టైక్వాండో పోటీలకు ఎంపికైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అక్టోబర్ 2 నుంచి 4 వరకు జరగనున్న 43వ జాతీయ పోటీల్లో ఆమె ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
ఆగస్టులో శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో హర్షిత స్వర్ణం సాధించి ఈ అర్హత పొందినట్లు కోచ్ ఎన్.సత్యనారాయణ తెలిపారు. హర్షితను అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు అభినందించారు.
Comments
Loading comments...

