వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివనగర్ మండలంలోని అయ్యప్ప ఆలయం సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
స్థానికులు గమనించి అంబులెన్స్ కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వారు పాల్వంచ మండలం పేట గ్రామానికి చెందినవారిగా సమాచారం.
Comments
Loading comments...

