వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్పురం మండలం సోములగూడెం పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని కుంజ దివ్య జాతీయస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైంది. పల్నాడు జిల్లా కారేంపూడిలో ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది.
పద్నాలుగేళ్లలోపు బాలికల 30 కిలోల విభాగంలో దివ్య విజేతగా నిలిచింది. ఈ నెల 30 నుంచి నవంబర్ 5 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటుందని వ్యాయామ ఉపాధ్యాయుడు శివకుమార్ తెలిపారు.
Comments
Loading comments...

