Back to feed
ఐటీ రిటర్నుల దాఖలు షురూ.. చివరి తేదీలు ఇవే!
Ravi Shukla May 16, 2026 7:23 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

పన్ను చెల్లింపుదారులు 2026-27 మదింపు సంవత్సరానికి గాను ఐటీఆర్-1, ఐటీఆర్-4లను ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు వీలుగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సర ఆదాయానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల దాఖలును ప్రారంభించవచ్చని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది.
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్-1 దాఖలు చేయడానికి జులై 31 చివరి తేదీ కాగా, ఆడిట్ పరిధిలోకి రాని ఐటీఆర్-4 చెల్లింపుదారులకు ఆగస్టు 31 వరకు గడువు ఉంది.
Comments
Loading comments...



