వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ ఉద్యోగాలిప్పిస్తామంటూ సాఫ్ట్‌వేర్ ఆశ చూపిన సైబర్ ముఠా గుట్టును అంబర్‌పేట పోలీసులు రట్టుచేశారు. బెంగళూరు కేంద్రంగా నకిలీ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి, సోషల్ మీడియా వేదికగా నిరుద్యోగులను ఈ ముఠా బురిడీ కొట్టించింది.
ఈ దందాలో ఇప్పటివరకు 40 మంది బాధితుల నుండి సుమారు కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ముఠాలోని ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి నగదు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

