వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలంలో రక్షణ చర్యలు పాటించకుండా ఇసుక తరలిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం తామరాపల్లి వద్ద జాతీయ రహదారిపై పరదాలు లేకుండా ఇసుక ట్రాక్టర్ కనిపించింది.
గాలికి ఇసుక ఎగిరి వెనుక వచ్చే వాహనదారుల కళ్లలో పడుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

