Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక లారీల వేగంపై కఠిన నియంత్రణ విధించాలి: చల్లా

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:18 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఇసుక లారీల వేగంపై కఠిన నియంత్రణ విధించాలి: చల్లా - Udayam
మహదేవపూర్‌లో ఇసుక లారీ ఢీకొని పోత స్వామి మృతి చెందడంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, స్వామి కుమార్తెకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇసుక లారీల వేగం, రవాణాపై కఠిన నియంత్రణలు విధించాలని కోరారు.

Comments

G
Loading comments...