Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 20, 2026 6:17 PM నల్గొండGeneral
ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు - Udayam
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం దుగినవెల్లి పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలపై మాజీ ఉప సర్పంచ్ జాల అంజనేయులు ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యాసంగి సీజన్‌లో ఇన్‌చార్జిగా ఉన్న కారింగు సైదులు నకిలీ పేర్లతో ట్రక్ షీట్లు సృష్టించి, ప్రభుత్వ నిధులను తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించారని ఆరోపించారు. రికార్డులను పరిశీలించి బాధ్యుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...