Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇర్లపాడులో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ చోరీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 5:29 PM పల్నాడుGeneral
ఇర్లపాడులో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ చోరీ - Udayam
ఇర్లపాడులో గుర్తుతెలియని దుండగులు వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి విలువైన సామగ్రిని చోరీ చేశారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా పాడై విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంటలు వేసే కీలక సమయంలో సాగునీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోకుండా తక్షణమే ప్రత్యామ్నాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని గణపవరం సబ్ స్టేషన్ అసిస్టెంట్ ఇంజినీర్‌ను కోరారు.

Comments

G
Loading comments...