Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IPPB పధకం కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తుంది

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 6:19 PM విజయనగరంGeneral
IPPB పధకం  కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తుంది - Udayam
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ( IPPB) పథకం కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని గజపతినగరం పోస్టల్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. గజపతినగరంలో ఇటీవల ప్రమాద బీమా పాలసీ తీసుకుని మరణించిన వ్యక్తి కుటుంబానికి IPPB రూ.15 లక్షల బీమా చెక్కును అందజేసింది. IPPB తొమ్మిదవ పౌండేషన్‌ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా పాలసీ తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...