Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాలంపాడులో మూడు రోజుల ఆలయ వేడుకలు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 10:10 AM జోగులాంబ గద్వాల్ General
ర్యాలంపాడులో మూడు రోజుల ఆలయ వేడుకలు - Udayam
ర్యాలంపాడు పునరావాస కేంద్రంలోని నూతన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని గ్రామస్థులు కోరారు. శుక్రవారం గద్వాల క్యాంప్‌ కార్యాలయంలో మాజీ వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించి ఆహ్వానపత్రం అందజేశారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో బొడ్రాయి, గరుడస్తంభ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...