Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిశువు మృతదేహం మాయమైన ఘటనపై దర్యాప్తు

Follow Udayam on Google
రాజిత దేవి Aug 12, 2026 8:46 AM హైదరాబాద్General
శిశువు మృతదేహం మాయమైన ఘటనపై దర్యాప్తు - Udayam
పంజగుట్ట శ్మశానవాటికలో ఖననం చేసిన శిశువు మృతదేహం మాయమైన ఘటనపై బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాటికాపరి జగన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, మరో నలుగురు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. అమావాస్య రోజున క్షుద్రపూజల కోసం మృతదేహాన్ని మాయం చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ, స్థానికులను ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...