Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు: జూనియర్ ఆర్టిస్ట్ అరెస్ట్

Follow Udayam on Google
Sakshi Joshi Jun 09, 2026 6:38 PM హైదరాబాద్General
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు: జూనియర్ ఆర్టిస్ట్ అరెస్ట్ - Udayam
బ్యాంకాక్ నుంచి భారత్‌కు ‘ఓజీ గంజాయి’ని స్మగ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ ముఠాను అధికారులు పట్టుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ నూరికళను అరెస్టు చేసి, ఆమె నుంచి 2.15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు కేరళకు చెందిన నఫ్షీద్ సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు విచారణలో తేలింది. మహిళలకు డబ్బు ఆశ చూపి, విదేశీ పర్యటనల పేరుతో డ్రగ్స్ రవాణాకు ఈ ముఠా వినియోగిస్తోంది. ఒక్కో ట్రిప్‌కు రూ. 20 వేల వరకు చెల్లిస్తూ గృహసహాయకులు, జూనియర్ ఆర్టిస్టులను పావులుగా వాడుకుంటున్నారు. ప్రధాన నిందితుల కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...