Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులాంతర జంటలకు ప్రోత్సాహకం ఆలస్యం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 29, 2026 6:13 PM నల్గొండGeneral
కులాంతర జంటలకు ప్రోత్సాహకం ఆలస్యం - Udayam
కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం అందించే రూ.2.50 లక్షల ప్రోత్సాహకం మంజూరులో జాప్యం కొనసాగుతోంది. జిల్లాలో 367 మంది జంటలు దరఖాస్తు చేసినప్పటికీ నిధుల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. 2019 నుంచి 493 దరఖాస్తులు రాగా 126 మందికే ప్రోత్సాహకం అందింది. అర్హులైన జంటలు మూడేళ్లుగా నిరీక్షిస్తున్నామని, ప్రభుత్వం పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...